శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే కేవలం రూ. 151కే అందజేయనున్నట్లు నారాయణఖేడ్ డిపో మేనేజర్ సుబ్రమణ్యం తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి భద్రాచలం వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ఈ సేవను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.