నారాయణఖేడ్: లింగాపూర్ గ్రామంలో హెల్త్ క్యాంప్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలో బుధవారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.

సంబంధిత పోస్ట్