నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి చేతుల మీదుగా కార్మికులకు దుస్తుల పంపిణీ

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ శాసనసభ్యులు, లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హాజరై కార్మికులకు దుస్తులను అందజేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకమని, ఎండ వానలను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న వారిని అభినందించారు. సమాజ సేవలో భాగంగా దుస్తులు అందించిన లయన్స్ క్లబ్ సభ్యులను ఎమ్మెల్యే కొనియాడారు.

సంబంధిత పోస్ట్

✕
✕