నారాయణఖేడ్ పట్టణంలో ఆదివారం ఎంపీ సురేష్ షెట్కార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇరాక్ పల్లికి చెందిన శివాజీకి 30 వేలు, షెల్గిరాకు చెందిన లక్ష్మికి 16,000, తరుణ్ రెడ్డికి 8,000 రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. పేద ప్రజల వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తుందని ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు.