ఖేడ్ మండలం జుక్కల్ రైతు వేదికలో ఎరువుల డీలర్లకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రానున్న వానకాలం సీజన్లో వర్షపాతం తక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా తక్కువ నీటితో పండే స్వల్పకాలిక రకాల విత్తనాలను అందుబాటులో ఉంచి రైతులకు అమ్మాలని తెలిపారు. ఏడీఏ నూతన్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.