నారాయణఖేడ్: రేపు సీమాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవం

నారాయణఖేడ్ మండలం చాప్ట కే శివారులో వెలసిన శ్రీ సీమాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవ వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. నిర్వాహకులు బుధవారం ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యహావచనం, ఆంజనేయ స్వామికి సింధూర లేపనం, మహా రుద్రాభిషేకం పూజలు, అఖండ హరినామ సప్తహం నిర్వహించబడతాయి. ఈ వేడుకలు ఈ నెల 15 వరకు కొనసాగుతాయని గ్రామస్థులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్