శ్రీకృష్ణుడికి సామూహిక లక్ష పుష్పార్చన

కంగ్టి మండల కేంద్రానికి సమీపంలోని జుక్కల్ రామాలయంలో శనివారం లక్ష పుష్పార్చన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువర్యులు కేశవ మహారాజ్ నేతృత్వంలో శ్రీకృష్ణుడికి పుష్పాభిషేకం నిర్వహించారు. అధిక జ్యేష్ఠ పురుషోత్తమ మాసం పురస్కరించుకుని కొనసాగుతున్న భాగవత సప్తాహంలో శని త్రయోదశి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముత్తయిదువులు, మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్