పాశ మైలారం లోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన 54 మంది కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఇస్నాపూర్ లో సోమవారం ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగి చాలా కాలమైనా ప్రభుత్వం, యాజమాన్యం ఇప్పటివరకు పరిహారం అందించకపోవడం సరికాదని, వెంటనే కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.