సంగారెడ్డి ఎస్పీ పంకజ్ పరితోష్ ఆదేశాల మేరకు, నారాయణఖేడ్ డి.ఎస్.పి వెంకట్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో షీటీం ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ మైదానంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఫోక్సో చట్టం, సైబర్ క్రైమ్ లపై అవగాహన కల్పించిన షీటీం ఏఎస్ఐ తులసి రామ్ బాయి, చట్టాలపై అవగాహనతోనే రక్షణ పొందవచ్చని తెలిపారు. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, డయల్ 100 లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ఆదిత్య, సునీల్ రాజ్ పాల్గొన్నారు.