వెంకటాపూర్ లో భవాని యూత్ అధ్యక్షుడిగా పుర్ర జ్ఞానేషశ్వర్ ఎన్నిక

సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో రానున్న అమ్మవారి నవరాత్రుల సందర్భంగా, గ్రామ ప్రజలు, యువకులు కలిసి 9 రోజుల పాటు భవాని మాత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు పుర్ర జ్ఞానేషశ్వర్  ని భవాని యూత్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నారు. గత 16 సంవత్సరాలుగా భవాని మాత విగ్రహ పూజలు ఆటపాటలతో, ఊరు మొత్తం ఏకతాటిపై భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు నూతన అధ్యక్షుడు తెలిపారు. ఈ ఉత్సవాలు  సెప్టెంబర్ 27 నుండి ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕