నారాయణఖేడ్ కట్ట మైసమ్మ బోనాల వేడుకల్లో పాల్గొన్న సంగప్ప

నారాయణఖేడ్ లో జరుగుతున్న కట్టమైసమ్మ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సకాలంలో వర్షాలు పడాలని, పంటలు సమృద్దిగా పండాలని కోరుకున్నట్లు చెప్పారు. మైసమ్మ ను దర్శించుకున్న సంగప్ప ను ఆలయ కమిటీ తరపున గొల్ల సాయి ప్రభాకర్, రవి తదితరులు శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్