సిర్గాపూర్: చీకట్లో రోడ్డుపై విద్యార్థుల ధర్నా

సిర్గాపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ వసతిగృహ విద్యార్థులు గురువారం రాత్రి హాస్టల్ ఎదుట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా కరెంటు లేక చిమ్మ చీకట్లో ఉంటున్నామని, వసతులు కోల్పోతున్నామని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే చీకట్లో హాస్టల్ ఎదుట బైఠాయించి వార్డెన్ కిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్