సిర్గాపూర్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన రైతులు తమ జొన్న రాశులను కొనుగోలు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్లో అధికంగా సాగు చేసిన దాదాపు 80 లారీల జొన్నలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని, అయితే పక్షం రోజులు గడిచినా కొనుగోలు ప్రారంభం కాలేదని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేపట్టాలని రైతు వెంకట్రావు కోరారు.