పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి మందిరంలో పౌర్ణమి సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు, పురోహితులు చిన్ని మధుకర్ ఆధ్వర్యంలో ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామివారికి, పరమశివుడికి, శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చిన్ని మధుకర్ మరియు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕