మనూరు మండలం బోరంచ గ్రామంలోని నల్ల పోచమ్మ తల్లికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వాదశి పురస్కరించుకొని అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాలను జరిపించి ప్రత్యేక అలంకరణ చేశారు. మంగళహారతి, నీరాజనం నైవేద్యాన్ని సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.