కంగ్టి మండల కేంద్రంలో గురువారం, వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సబ్ కలెక్టర్ ఉమా హారతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశిస్తూ, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.