నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఖేడ్ శిశుమందిర్ లో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయబడింది. 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన శాస్త్రీయ విద్యను అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యం. చదరంగం, చిత్రలేఖనం, పత్ర చిత్రకళ, సాంస్కృతిక కళలు (చెక్క భజన, యోగచాప్, కోలాటం), భారతీయ ఆటలు, చేతి వ్రాత, దండ (కర్రసాము), సదాచారము (నీతికథలు, శ్లోకాలు, సంగీతం) వంటి అంశాలను నేర్పించనున్నారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలకు బానిసలవుతున్న పిల్లలకు ప్రత్యామ్నాయంగా ఈ శిబిరం ఉపయోగపడుతుంది.