హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. నిజాంపేటలో కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సాయి రెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు.