నిజాంపేటలోని రైతు వేదికలో గురువారం మండలంలోని 29 మంది బీఎల్దలకు తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా శిక్షణ తరగతులు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ నగేశ్, మెదక్ ఆర్డీవో రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతి, యువకులకు సంబంధించి ఓటర్ నమోదును చేసే బాధ్యత బీఎల్వోలదే అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.