నిజాంపేట్: వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నిజాంపేట్ ఎంపీడీవో సంగ్రామ్ తెలిపారు. నిజాంపేట మండలం బాచేపల్లి జడ్ పిహెచ్ఎస్, గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం మొక్కలను నాటారు. విద్యార్థులు, గ్రామస్థులు మొక్కలకు నీటిని అందించి పరిరక్షించాలని సూచించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్