సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని పి యం శ్రీ. మోర్గి మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో మంగళవారం ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులతో నమూనా పార్లమెంట్ వ్యవస్థను నిర్వహించారు. పాఠశాల హెడ్ బాయ్ నరేష్ స్పీకర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రస్తుత ప్రభుత్వ పాలనా వ్యవస్థ, పరిపాలన చర్యలు, పథకాలపై చర్చించి, పార్లమెంట్ సమీక్ష ద్వారా నిర్ణయాలు తీసుకోవడం గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించిన ఎంపీడీఓ మల్లేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాపారావు, పండరి, ఉపాధ్యాయబృందం పాల్గొన్నారు.