బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేస్తే సొంత కన్ను పొడుచుకున్నట్లే: కాంగ్రెస్ నాయకులు

ఆందోల్ నియోజకవర్గం టెక్మాల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయడం అంటే సొంత కన్ను పొడుచుకున్నట్లేనని, గత పదేళ్లుగా టెక్మాల్ గ్రామాన్ని నాశనం చేశారని ఆరోపించారు. గొల్లెగూడెంకు రోడ్డు వేసి కష్టాలు దూరం చేశామని, గాజుల గూడెంకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వస్తే గొల్లగూడెంకు రాలేదని, దళిత బంధు పథకం కూడా పక్క ఊరికి తరలించారని విమర్శించారు. టెక్మాల్‌కు ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా రాలేదని, అయితే కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు, గాంధీభవన్ నుండి మార్కెట్ వరకు సిసి రోడ్, కస్తూర్బా పాఠశాలకు నిధులు తెచ్చి విద్యార్థుల బాధలు తీర్చామని తెలిపారు. మోడల్ స్కూల్‌కు పదేళ్లుగా కిటికీలు లేక విద్యార్థులు చలికి ఇబ్బంది పడుతున్నారని, ఇటువంటి నాయకులను నమ్మితే ఊరు సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ అభ్యర్థి తిమ్మిగారి సుధాకర్ ను గెలిపిస్తే ఊరు అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు షేక్ మజహర్, టేక్మాల్ మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, వడ్ల నర్సింలు, శేషు గౌడ్, రమేష్, కొత్త అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్