వాంకిడి మండల కేంద్రంలోని బంబార గ్రామ పంచాయతీలోని రాజీవ్ నగర్ గ్రామానికి ప్రధాన రహదారి మొత్తం గుంతలు, బురదమయంతో ఉండడంతో గ్రామ ఆదివాసి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ప్రజలు వాంకిడి మండలానికి వెళ్తుంటారు. కానీ ఇలా గుంతలు, బురదమయంతో ఉండడంతో పలు వాహనాలు రాకపోకలు నిలిచాయి. శుక్రవారం ఆదివాసీ ప్రజలు మాట్లాడుతూ మా ఊరి రోడ్డుకి పూర్తిగా మరమ్మత్తులు చేసి మెరుగైన సౌకర్యాన్ని కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.