సంగారెడ్డి జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాకు ఇప్పటివరకు 97 శాతం పాఠ్యపుస్తకాలు చేరాయి. మొత్తం 7.14 లక్షల పుస్తకాల అవసరానికి గాను 6.95 లక్షల పుస్తకాలు ఇప్పటికే చేరుకున్నాయి. వీటిలో 5.60 లక్షల పుస్తకాలను మండల కేంద్రాలకు పంపించి, అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేయాలని ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పుస్తకాలు అందజేయాలనిశుక్రవారం స్పష్టం చేశారు.