మండల విద్యాధికారులు తమ తనిఖీల సమయంలో సేకరించిన వివరాలను ఎడ్యుకేషన్ జాబ్ లో వెంటనే నమోదు చేయాలని డీఈవో వెంకటేశ్వర్లు గురువారం ఆదేశించారు. పాఠశాలల్లో ఎఫ్ ఎల్ ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమం పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలని సూచించారు. ఈ వివరాలను వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు.