జహీరాబాద్ కొత్త సంవత్సరం.. పాత దుస్తులతోనే పాఠశాలకు..!

2026-27 విద్యా సంవత్సరం ఈ నెల 15న ప్రారంభం కానుంది. అయితే, జిల్లాకు ఇప్పటివరకు యూనిఫామ్ క్లాత్ చేరకపోవడంతో 1.19 లక్షల మంది విద్యార్థులకు కొత్త దుస్తులు అందుబాటులోకి రాలేదు. ప్రారంభ రోజుల్లో విద్యార్థులు పాత యూనిఫామ్స్‌తోనే పాఠశాలలకు హాజరుకావాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. డీఈవో రోహిణి వెల్లడించిన ప్రకారం, వారం రోజుల్లో క్లాత్ అందే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్