ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటేశ్వర స్వామి ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ పరీక్షల అడ్మిషన్ గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగించారు. అడ్మిషన్ల కోసం సమీపంలోని అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని, ఈ గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.