పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతిచెందిన కార్మికులకు నివాళులర్పిస్తూ బొల్లారం మున్సిపాలిటీలో కొవ్వొ త్తుల ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌరస్తా నుంచి పాత హనుమాన్ ఆలయం వరకు సంఘ సేవకుడు ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ శుక్రవారం చేపట్టారు. విషాదకరమైన ఈ సంఘటనలో మృతి చెందిన కార్మికులకు కొవ్వొత్తులతో నివాళులు ఘటించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.