రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రాపురంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గురువారం ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్బంగా ప్రతి సంవత్సరం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామన్నారు. విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు కృషి వెలకట్టలేనిది అన్నారు.