సంగారెడ్డి: ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన బాధిత రైతులు

భూసేకరణ అంశంలో నష్టపోతున్న ప్రతి రైతుకి మెరుగైన నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం గుమ్మడిదల సర్వే నెంబర్ 109లో భూములు కోల్పోతున్న రైతులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. టీజీఐఐసి ఆధ్వర్యంలో చేపట్టబోయే పరిశ్రమల పార్కు కోసం చేపడుతున్న భూ సేకరణ అంశంలో న్యాయమైన నష్టపరిహారం అందించేలా ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్