అమీన్ పూర్ మండలం సుల్తాన్పూర్ లో శుక్రవారం రాత్రి చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శివాజీ ఆశయాలు నేటి యువతకు ఆదర్శనీయమని, వాటిని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ నాయకులు పాల్గొన్నారు.