తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి నేటి వరకు రాష్ట్ర ప్రగతిలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన పాత్ర అద్వితీయమని, ముఖ్యంగా రైతు సంక్షేమం మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పార్టీ అంకితభావంతో పనిచేస్తోందని నాయకులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-01లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌస్, నిరంజన్, తాహేర్, మొయిజ్, అసిఫ్, కళ్యాణ్, హమీద్, చావోస్, శ్రీను, గౌరీ ఖాన్, అమిద్, మెహబూబ్, రఫిక్, నశ్రత్ బురాన్ తదితరులు పాల్గొన్నారు.