సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామ పంచాయతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రుద్ర గాయత్రి మాత సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి దామోదర్ రాజనర్సింహా సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తనను ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వార్డు అభ్యర్థులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.