పటాన్‌చెరు డివిజన్లో పర్యటించిన కార్పొరేటర్

పటాన్ చెరు డివిజన్ బండ్లగూడ మార్క్స్ నగర్ కాలనీలో గురువారం స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా  కాలనీలోని సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో కాలనీవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారని కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు డీజీఏమ్ శివ కుమార్, మేనేజర్ అరుణ్ తో కలిసి మార్క్స్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్