పటాన్చెరు డివిజన్ పరిధిలోని గాంధీ పార్క్ సమీపంలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించి. ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.