గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కాజీపల్లిలో కాలుష్య జలాలు ఒక గేదె ప్రాణం తీశాయి. గ్రామ శివారులో మేతకు వెళ్లిన గేదె, సమీప పరిశ్రమల నుంచి పొలాలు, చెరువులు, కుంటల్లోకి చేరిన కలుషిత నీటిని తాగడంతో మృతి చెందింది. ఈ ఘటనతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాడు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల వల్ల పర్యావరణానికి, జీవరాశులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.