ఫైర్ సేఫ్టీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. పాశమైలారంలో ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి పర్యటించారు. ఐలా సెంటర్ లో పరిశ్రమల యాజమాన్యాలతో ఫైర్ సేఫ్టీ డీజీ భేటీ అయ్యారు. పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో అగ్నిప్రమాద నియంత్రణ చర్యలు లేవని గుర్తించారు. సిగాచీ పరిశ్రమ ఘోర ప్రమాదం నేపథ్యంలో అలెర్ట్ గా ఉండాలనీ ఆదేశించారు.