పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో వేణు అనే ప్రైవేట్ ఉద్యోగి అదృశ్యమయ్యాడు. ఈ నెల 2వ తేదీన భార్య కుమారితో డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగిన తర్వాత, వేణు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.