జిన్నారం మండలంలో వృద్ధుడు అదృష్టమైన సంఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మాదారం గ్రామానికి చెందిన దూదేకుల దావూద్ (69) ఈనెల 9న గ్రామంలోని తన కొడుకు దగ్గర నుండి కొడకంచి గ్రామానికి వెళ్ళే మార్గంలో వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కాగా వృద్ధుడికి మతిస్తిమితం లేదు. వృద్ధుడి కుమారుడు దూదేకుల షాబుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు.