సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని శాంతినగర్ కాలనీలో 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన బడా వినాయకుని నిమజ్జనం ఉత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. డీజే, బ్యాండ్ పాటలతో పటాన్చెరు ప్రాంతం కేరింతలతో మారుమోగింది.