ఇంద్రేశం వ్యక్తి అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశంకు చెందిన గోవింద్ (40) ఈ నెల 28వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గోవింద్ ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. అతని ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పటాన్‌చెరు పోలీసులను సంప్రదించి సమాచారం అందించాలని అధికారులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్