జిన్నారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పిఆర్టియు అభ్యర్థి సేకరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మాణయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పిఆర్టియు కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, మండల అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.