అమీన్పూర్‌లో కత్తిపోట్ల కలకలం.. సీసీ ఫుటేజ్ విడుదల

పటాన్‌చెరు అమీన్‌పూర్‌లో కర్రీ ధర విషయంలో తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. రూ. 10కి కూర ఇవ్వలేనని చెప్పడంతో ఆగ్రహించిన జీవరత్నం అనే వ్యక్తి, కర్రీ పాయింట్ యజమాని ఉదయ్ భాస్కర్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉదయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్