భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఫెన్సింగ్ ఏరియాలో శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీలకు చెందిన నాయకులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.