సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఉత్సవాలను ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 3రోజులపాటు వైభవంగా నిర్వహించనున్నారు. 17న ఉత్సవాలు ప్రారంభం, 18న స్వామి వారి కళ్యాణం, సాయంత్రం స్వామివారి ఊరేగింపు, 19న పుష్పయాగం, వసంతోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.