సంగారెడ్డి: మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో సోమవారం మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ నాగమణి మాట్లాడుతూ.. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఎంఐ నెంబర్ వేస్తున్నారు. పుట్టిన పిల్లల నుంచి 10 సంవత్సరాలలోపు పిల్లలకు టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆశా వర్కర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్