పాటి గ్రామంలో నూతన కల్వర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రతి ఒక్కరి మతాన్ని గౌరవిస్తూ నియోజకవర్గంలో పరమత సహనాన్ని పెంపొందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పాటి గ్రామ పరిధిలోని మరనాత హీలింగ్ టెంపుల్ చర్చి సమీపంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన కల్వర్టును ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి, చర్చి నిర్వాహకులు భాస్కరరావు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్