పటాన్ చెరు: హరీశ్ రావును కలిసిన బీఆర్ఎస్ నేత గూడెం

అక్రమ మైనింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కేసులు నమోదు చేసి అర్ధరాత్రి అరెస్టు చేసిందని, ఇది నియంతృత్వ వైఖరి అని బీఆర్ఎస్ సీనియర్ నేత గూడెం మధుసూధన్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో, తనకు మద్దతుగా మాట్లాడిన రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావును ఆదివారం హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్