పటాన్చెరు: 42 పార్కుల అభివృద్ధికి చర్యలు ఎమ్మెల్యే

అమీన్‌పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఫేజ్ 2 కాలనీ పార్కు, హుడా కాలనీ పార్కు 2 కాలనీలలో ఒక కోటి 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో పార్కులలో మొక్కలు నాటడం, ఆట స్థలాలు, వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్