పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ముత్తంగి పరిధిలోని బతుకమ్మ ఘాట్ వద్ద లావణ్య పద్మావతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరాల ద్వారా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, వైద్యుల సలహాలు, అవసరమైన మందులు ఉచితంగా అందడం వల్ల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.